Monster Film Review: మోహన్ లాల్ కెరీర్ లో వరస్ట్ మూవీ

ABN , First Publish Date - 2022-12-07T18:38:34+05:30 IST

భారతదేశం లో వున్న సూపర్ స్టార్ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. అటువంటి మోహన్ లాల్ నటించిన 'మాన్‌స్టర్' (Monster) సినిమా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

Monster Film Review:  మోహన్ లాల్ కెరీర్ లో వరస్ట్ మూవీ

సినిమా: మాన్‌స్టర్ (Monster)

నటీనటులు: మోహన్ లాల్, హానీ రోజ్, మంచు లక్ష్మి, సుదేవ్ నాయర్, సిద్దికీ తదితరులు

నిర్మాత: ఆంథోనీ పెరుంబవూర్

దర్శకుడు: వైశాఖ్

--- సురేష్ కవిరాయని

మలయాళం నటుడు మోహన్ లాల్ (Mohanlal) అంటే ఒక్క మలయాళం ప్రేక్షకులకే కాదు, మిగతా ప్రాంతాల వారికి కూడా బాగా పరిచయం వున్న నటుడు. భారతదేశం లో వున్న సూపర్ స్టార్ నటుల్లో మోహన్ లాల్ ఒకరు. అటువంటి మోహన్ లాల్ నటించిన 'మాన్‌స్టర్' (Monster) సినిమా డిస్నీ హాట్ స్టార్ (Disney Hotstar) లో విడుదల అయింది. ఇందులో తెలుగు నటి మంచు లక్ష్మి (Telugu actress Manchu Lakshmi) కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. వైశాఖ్ (Vysakh is the director) దీనికి దర్శకుడు కాగా హానీ రోజ్ (Honey Rose) ఇందులో ఒక లీడ్ యాక్ట్రెస్ గా ప్లే చేసింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

mohan-lal2.jpg

మాన్‌స్టర్ కథ: (Monster Story)

భామిని (హానీ రోజ్) మరియు అనిల్ చంద్ర (సుదేవ్ నాయర్) భార్య భర్తలు. వారికో పాప ఉంటుంది. భామిని ఇటు ఇంట్లో పాపని చూసుకుంటూ, ఇంకో పక్క టాక్సీ డ్రైవర్ గా కూడా పని చేస్తూ ఉంటుంది. పాపని చూసుకుందుకు ఒక ఆయా (మంచు లక్ష్మి) కూడా ఉంటుంది. ఆరోజు భామిని, అనిల్ ల వివాహ దినోత్సవం అవటం వాళ్ళ సంతోషంగా సెలెబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు. భామిని డ్యూటీ ఆరోజు ఎయిర్ పోర్ట్ కి వెళ్లి లక్కీ సింగ్ (మోహన్ లాల్) ని తీసుకొని అతను ఎక్కడ అంటే అక్కడ దింపేయాలి. లక్కీ సింగ్, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పని ఉందని చెప్పి అక్కడ కొద్దీ సేపు ఆగుతాడు. తరువాత భామిని వేరే క్యాబ్ మాట్లాడుతాను అంటే, వద్దు భామిని క్యాబ్ మాత్రమే కావాలి అంటాడు. భామిని ఆరోజు తమ వివాహ దినోత్సవం అని చెప్పినా తాను కూడా వాళ్ళతో పార్టీ లో పాల్గొని మళ్ళీ సాయంత్రం ఎయిర్ పోర్ట్ దగ్గర దించేస్తే చాలు అని చెప్తాడు. భామిని సరే అంటుంది. ఇంతవరకు బాగానే వుంది, ఇప్పుడే అసలు కథ ప్రారంభం అవుతుంది. భామిని లక్కీ సింగ్ ని ఎయిర్ పోర్ట్ దగ్గర దించి ఇంటికి వచ్చేసరికి ఆమె భర్త అనిల్, పాప ఇద్దరూ కనపడరు. ఇద్దరూ ఏమయ్యారు, లక్కీ సింగ్ ఎవరు, భామిని ఏమి చేసింది, ఆమె వెనకాల కథ ఏంటి తెలుసుకోవాలంటే సినిమా చూడండి.

విశ్లేషణ:

ఈమధ్య క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలా వచ్చాయి. కానీ అన్నిటితో పోలిస్తే ఈ 'మాన్‌స్టర్' సినిమా మాత్రం చాలా చీప్ గా, ఛండాలంగా తీసాడు అనిపిస్తుంది. దర్శకుడు వైశాఖ్ తీసుకున్న కథ కూడా అసలు బాగోలేదు, సరికదా ఇలాంటి కథలు ఎంచుకునేటప్పుడు కొంచెం పరిశోధన చేయటం అవసరం. అదీ కాకుండా సినిమా మొదటి గంట కూడా చీప్ మాటలతో, ఆసక్తి లేకుండా, ఏమాత్రం కథ అస్సలు ముందుకు నడవదు. అదీ కాకుండా ఒక సూపర్ స్టార్, జాతీయ అవార్డు గ్రహీత అయినా మోహన్ లాల్ తో దర్శకుడు చాలా చీప్ కామెడీ చేయించడం అస్సలు బాగోలేదు. సినిమా హోమోసెక్సువల్ అనే అంశం మీద తీసేటప్పుడు దాన్ని జాగ్రత్తగా తీయాలి. ఎంచుకున్న కథే తప్పయినపుడు, అది నేరేట్ చేసే విధానం కూడా సరిగ్గా లేనప్పుడు ఆ సినిమా అసలు ఆసక్తికరంగా ఉండదు. ఉదయ్ కృష్ణ అనే అతను కథ ఇచ్చాడు, వైశాఖ్ దర్శకత్వం చేసాడు.

mohan-lal3.jpg

కానీ క్రైమ్ థ్రిల్లర్ అన్నారు కానీ ఇందులో థ్రిల్లింగ్ సన్నివేశాలు కన్నా, రెండర్థాల మాటలు, బోరింగ్ సన్నివేశాలు ఎక్కువ వున్నాయి. పోనీ చూస్తున్న ప్రేక్షకుడుకి ఇందులో ఏమైనా సస్పెన్స్ ఉంటుంది అనుకుంటే, ఎలాంటి సినిమాలు చూస్తున్న వాళ్ళకి ఇందులో విలన్ ఎవరు, ఎవరు ఎవరిని చంపారు అన్నది కూడా అర్థం అయిపోతుంది. అలంటి సినిమా ఈ 'మాన్‌స్టర్'. ఒక సూపర్ స్టార్ ని పెట్టుకొని, ఇంత చీప్ సినిమా ఎలా తీశారో అర్థం కాదు, మోహన్ లాల్ లాంటి నటుడు కూడా ఎలా వొప్పుకున్నాడో ఇది అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సినిమా కథలో ముఖ్యాంశం ఏంటి అంటే హర్యానా లో 2011 లో జరిగిన ఒక సంఘటనలో హై కోర్ట్ ఇద్దరు స్వలింగ సంపర్కులు వివాహం చేసుకోవచ్చు అని తీర్పు చెప్తుంది. కానీ అక్కడి ప్రజలు ఆ ఇద్దరి స్వలింగ సంపర్కులని ఆ ఊరి నుండి తరిమి కొడతారు. పోలీస్ లు కూడా అక్కడి ప్రజలకు సహాయం చేస్తారు. అయితే దర్శకుడు అది సరిగా చూపించలేక, సరి అయినా పరిశోధన లేక, మొత్తం కథని చెత్తగా చేసి చూపించాడు. (The court accepted the Homosexuals marriage, but the locals against it and shunted them out of their village)

ఇంకా నటీనటుల విషయానికి వస్తే, అయిదు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న మోహన్ లాల్ కెరీర్ (This film is one of the worst films in Mohan Lal's career) లో ఇదో చెత్త సినిమా. అతను లక్కీ సింగ్ గా మొదట కనిపిస్తాడు, తరువాత ఇంకో అవతారం ఎత్తుతాడు. కానీ లక్కీ సింగ్ గా వున్నప్పుడు మాట్లాడిన మాటలు, చేష్టలు అతను చెయ్యాల్సిన పాత్ర కాదు ఇది. (This role is not supposed to do by a super star like Mohan Lal) అంత పెద్ద సూపర్ స్టార్ కూడా ఈ సినిమా లో ఒక చీప్ కామెడీ చేసాడు. మొదటి సగం కథలో విషయమే లేదు. హనీ రోజ్ (Honey Rose) భామిని గా చక్కగా నటించింది. ఆమెకి చాలా పెద్ద పాత్ర వచ్చింది, బాగా చేసి చూపించింది. సుదేవ్ నాయర్ (Sudev Nair) కూడా బాగున్నాడు. మంచు లక్ష్మి (Manchu Lakshmi) చివర అరగంట మాత్రమే బాగా కనిపిస్తుంది. ఆమె పాత్రని కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండేది. అలాగే పోలీస్ ఆఫీసర్స్ గా సిద్ధికీ ఇంకా మిగతా వాళ్ళు అందరూ బాగున్నారు.

mohan-lal4.jpg

మోహన్ లాల్ కి మరియు మంచు లక్ష్మి కి మధ్య జరిగిన పోరాట సన్నివేశాన్ని బాగా చిత్రీకరించారు (The action scene between Manchu Lakshmi and Mohan Lal is choreographed well) . అదొక్కటే చూడటానికి బాగుంది. సంగీతం, బ్యాక్ గ్రౌండ్ సంగీతం అంత చెప్పుకోదగ్గవిగా లేవు. మాటలు దరిద్రంగా వున్నాయి. సినిమాలో ఎక్కడ లాజిక్ కనపడదు. మొదటి గంట సినిమా మొత్తం వేస్ట్, సన్నివేశాలు అన్నీ ఎదో పెట్టాలి అన్నట్టుగ్గ పెట్టి బోర్ కొడతాయి. ఓ టి టి లో విడుదల అయింది కాబట్టి పరవాలేదు, ఎందుకంటే రిమోట్ మన చేతిలో ఉంటుంది కదా.

చివరగా, 'మాన్‌స్టర్' సినిమా స్వలింగ సంపర్కం గురించి ఎదో చివర్లో కొద్దీ నిముషాలు చెప్పినా, అది సరిగ్గా చూపించడం లో దర్శకుడు మొత్తం విఫలం అయ్యాడనే చెప్పాలి. మోహన్ లాల్ అభిమానులకి కూడా ఈ సినిమా నచ్చకపోవచ్చు. క్రైమ్ థ్రిల్లర్ అని అన్నారు కానీ, ఇందులో ఆ ఎలిమెంట్ తప్ప అన్ని బోరింగ్ సన్నివేశాలు వున్నాయి.

Updated Date - 2022-12-07T18:46:38+05:30 IST