Adipurush: మళ్లీ వాయిదా.. భారం రూ.100 కోట్లు !

ABN , First Publish Date - 2022-11-05T19:42:43+05:30 IST

‘బాహుబలి’ ప్రాంచైజీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-కె’, ‘రాజా డీలక్స్’ తదితర సినిమాలను ఒకే చేశాడు.

Adipurush: మళ్లీ వాయిదా.. భారం రూ.100 కోట్లు !
Adipurush

‘బాహుబలి’ ప్రాంచైజీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కించాడు. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్-కె’, ‘రాజా డీలక్స్’ తదితర సినిమాలను ఒకే చేశాడు. ఈ చిత్రాల్లో భారీ బజ్ ‘ఆదిపురుష్’ (Adipurush) పై ఉంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని మూవీ తెరకెక్కడంతో అంచనాలు ఆకాశనంటాయి. ‘ఆదిపురుష్’ కు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్‌అలీ ఖాన్ నటించారు. కొన్ని రోజుల క్రితమే అయోధ్యలో సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్‌ ఆశించిన స్థాయిలో లేవని అనేక మంది నెటిజన్స్ తెలిపారు. అందువల్ల సంక్రాంతికి విడుదల కావాల్సి చిత్రాన్ని వాయిదా వేశారు. వేసవి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. తాజాగా సమ్మర్ రేసు నుంచి కూడా ఈ మూవీ తప్పకుందని తెలుస్తోంది.

‘ఆదిపురుష్’ ను పాన్ ఇండియాగా తెరకెక్కించారు. టి- సిరీస్ రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని రూపొందించింది. చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్‌ను అనేక మంది ట్రోల్ చేశారు. సినిమాలోని పాత్రలన్ని కార్టూన్‌లా కనిపిస్తున్నాయన్నారు. రావణాసురుడి పాత్ర ఖిల్జీ మాదిరిగా ఉందని అనేక మంది అభిప్రాయపడ్డారు. సినిమా ప్రేమికులు కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందువల్ల అత్యధిక మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చిత్రాన్ని మరోసారి పోస్ట్‌పోన్ చేశారు. చిత్రబృందం విజువల్ ఎఫెక్ట్స్‌పై పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ ఎఫెక్ట్స్‌పై రూ.100కోట్లను ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

Updated Date - 2022-11-05T20:03:52+05:30 IST