Puri Jagannadh Musings: తాలింపు వేసే మాటలు మానుకోండి!
ABN , First Publish Date - 2022-12-10T13:23:25+05:30 IST
‘లైగర్’ పరాజయంతో కొంతకాలంగా సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చేసే పాడ్‌కాస్ట్‌లకు కూడా కొంత విరామం ఇచ్చిన ఆయన తాజాగా మళ్లీ ప్రారంభించారు. ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో పాడ్‌క్యాస్ట్ వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ గురించి చెప్పారు.
‘లైగర్’ పరాజయంతో కొంతకాలంగా సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్నారు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్Puri Jagannadh Musings. పూరీ మ్యూజింగ్స్’ పేరుతో చేసే పాడ్‌కాస్ట్‌లకు (Puri Jagannadh Musings)కూడా కొంత విరామం ఇచ్చిన ఆయన తాజాగా మళ్లీ ప్రారంభించారు. ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో పాడ్‌క్యాస్ట్ (Podcaste)వినిపించిన ఆయన ఈసారి ‘తడ్కా’ (Tadka)గురించి చెప్పారు. తడ్కా అంటే తాలింపు. అంటే ఆయన వంటల గురించి మాట్లాడారు అనుకుంటే పొరపాటే. ఆయనేం చెప్పారో... చూద్దాం. ‘‘మనం అప్పుడప్పుడు ఏదైనా పనికోసం ఓ మనిషిని మరో మనిషి దగ్గరకు పంపిస్తాం. అతను తిరిగొచ్చి అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా.. మిగిలినవ్నీ చెబుతాడు. ఏం జరిగింది? అని అడిగితే.. ‘మంచి రోజులుకావన్నా. నువ్వు ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నాలుగు డబ్బు వచ్చేసరికి కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు అయితే కొడతావ్’ అని మనం పంపించిన మనిషి జవాబిస్తాడు. కాదురా ఇంతకీ వాడు ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే.. ‘డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు’ అన్నా అని బదులిస్తాడు. అక్కడ పెనంలో ఉన్న దాన్ని ఇక్కడకి తీసుకొచ్చేలోపు మనుషులు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగం గొడవలు ఇలాగే తడ్కా వల్లే వస్తాయి. మధ్యవర్తులు జరిగిందిచెబుతున్నారా? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అనే దాన్ని గ్రహించాలి. ఆ మధ్యవర్తులు ఎవరో కాదు మనమే. ప్రతి ఒక్కరూ తడ్కా స్పెషలిేస్ట. తడ్కా లేకుండా ఎవరూ మన దగ్గరకు ఏ వంటకాన్నీ తీసుకురారు. మనమంతా పుట్టుకతోనే మంచిగా వండడం నేర్చుకున్నాం. అలవోకగా తడ్కా పెట్టేస్తాడు. ఐదుసార్లు తాలింపు వేయడం అయ్యాక మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకొస్తాడు వాసన చూసి బాగుంది అనుకుంటాం. కానీ, అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా జరిగిందే చెప్పాలి. అడిగితే మీ అభిప్రాయాన్ని చెప్పండి.. లేదంటే మానేయండి. ఇప్పుడు మనం ఎంత స్మార్ట్‌గా ఉంటున్నామో తడ్కా అలానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం’’ అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.