Viral Video: చిన్నారిపై దాడి చేసిన రకూన్.. ఆమెను తల్లి ఎలా కాపాడిందో చూడండి.. బాగా వైరల్ అవుతున్న వీడియో!

ABN , First Publish Date - 2022-12-05T20:25:06+05:30 IST

కుక్క కంటే చిన్నగా, పిల్లి కంటే కొంచెం పెద్దగా ఉండే రకూన్ అనే జంతువులు అమెరికాలో కనబడుతుంటాయి. తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లో ఓ బాలిక కాలును రకూన్ పట్టుకుని కొరకడానికి ప్రయత్నించింది. బాలిక అరుపులు, కేకలు వేసినా రకూన్ వదల్లేదు. కూతురి కేకలు విన్న తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చి రకూన్‌తో పోరాడింది.

Viral Video: చిన్నారిపై దాడి చేసిన రకూన్.. ఆమెను తల్లి ఎలా కాపాడిందో చూడండి.. బాగా వైరల్ అవుతున్న వీడియో!

కుక్క కంటే చిన్నగా, పిల్లి కంటే కొంచెం పెద్దగా ఉండే రకూన్ (Raccoon) అనే జంతువులు అమెరికాలో కనబడుతుంటాయి. మన దేశంలోని ఊర కుక్కలు, పిల్లుల తరహాలోనే ఇవి బయట తిరుగుతుంటాయి. ఇవి సాధారణంగా మనుషుల జోలికి రావు. అయితే ఒక్కోసారి చిన్న పిల్లలపై దాడి చేస్తుంటాయి. తాజాగా అమెరికాలోని కనెక్టికట్‌లో ఓ బాలిక కాలును రకూన్ పట్టుకుని కొరకడానికి (Raccoon Attacks Girl) ప్రయత్నించింది. బాలిక అరుపులు, కేకలు వేసినా రకూన్ వదల్లేదు. కూతురి కేకలు విన్న తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చింది.

కూతురి కాలును కొరకడానికి ప్రయత్నిస్తున్న రకూన్‌ను ఆ మహిళ ఒట్టి చేతులతోనే గట్టిగా పట్టుకుని లాగేసింది. కూతురిని వెంటనే ఇంట్లోకి పంపించి తలుపు వేసింది. ఆ రకూన్ తలను పట్టుకుని దూరంగా విసిరేసింది. ఈ వీడియో @FightClubVideos అనే ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ అయింది. ఈ వీడియోను (Viral Video) ఇప్పటివరకు 26 లక్షల మందికి పైగా వీక్షించారు. 48 వేల మంది లైక్ చేశారు. కూతురి కోసం రకూన్‌తో ధైర్యంగా పోరాడిన ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2022-12-05T20:25:07+05:30 IST