Bigg Boss 6: పచ్చబొట్టు పొడిపించుకున్న సిరి, శ్రీహాన్ ఏడుపు
ABN , First Publish Date - 2022-11-24T15:11:28+05:30 IST
ఈరోజు శ్రీహాన్ వంతు రాగా అతని భార్య సిరి వచ్చింది. అప్పటికే బిగ్ బాస్ శ్రీహాన్ ని ఫ్రీజ్ లో పెట్టాడు. సిరి రాగానే ఒక్కసారిగా శ్రీహాన్ ఏడుపు మొదలెట్టాడు
బిగ్ బాస్ లో ఇప్పుడు చాలా భావేద్వేగ సన్నివేశాలు కనపడుతున్నాయి. హౌస్ లో వుండేవాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపిస్తున్నారు కదా. (Contestants in the Bigg Boss house is meeting their family members and its emotional) ఈరోజు శ్రీహాన్ వంతు రాగా అతని భార్య సిరి వచ్చింది. అప్పటికే బిగ్ బాస్ శ్రీహాన్ ని ఫ్రీజ్ లో పెట్టాడు. సిరి రాగానే ఒక్కసారిగా శ్రీహాన్ ఏడుపు మొదలెట్టాడు. ఎందుకు ఏడుస్తున్నావ్ అని సిరి అడుగుతూ శ్రీహాన్ ని గట్టిగా కౌగలించుకుంది. ఇంకా సిరి ఉన్నంత సేపూ సరదాగా సాగి అందరి మీద సెటైర్ లు వేసింది.
మా టీవీ లో ఈ ఎపిసోడ్ గురించి హైలైట్స్ లా ఈరోజు ట్వీట్ చేశారు. ఇందులో శ్రీహాన్, సిరి, వాళ్ళ అబ్బాయి రావటం, అందరితో సరదాగా మాట్లాడటం కనిపిస్తుంది ఈ హైలైట్స్ లో. సిరి హౌస్ లో ఉన్న వాళ్లపై వరుసగా పంచ్‌లు విసిరింది. ఇనయతో ఏంటి మా వాడి మీద ఈ మధ్య శ్రద్ధపెట్టడం లేదు అంటూ పంచ్ వేసింది. (Siri surprised her husband showing the tattoo which says Srihan)
శ్రీసత్య వెంటనే శ్రీహాన్‌ని బాగా ఏడిపిస్తున్నాను ఏం అనుకోకు అని సిరితో అంటే, నేను అనుకుంటా, వాడిని ఏడిపించకు, అని సెటైర్ వేసింది సిరి. ఆ సెటైర్ కి సిరి షాక్ లో పడింది. ఆ తరవాత శ్రీహాన్‌ని లోపలికి తీసుకుని వెళ్లిన సిరి, నీకో సర్ప్రైజ్ కళ్ళు మూసుకో అంటూ శ్రీహాన్ పేరుని తన వీపుపై పచ్చబొట్టు పొడిపించుకున్నదాన్ని చూపించింది. తరువాత శ్రీహాన్-సిరిల అబ్బాయి ఇంట్లోకి సర్రున పరిగెత్తుకుంటూ వచ్చి మాటలతో అందరినీ అదరగొట్టాడు. ఇంట్లో ఒక్కో కంటెస్టెంట్స్ ఎలా ఎలా మాట్లాడతారో, ప్రవర్తిస్తారో ఆ చిన్న కుర్రాడు చెప్పి అందరిని ఆటపట్టించాడు. (#TeluguBiggBoss6 #BiggBoss6 #Srihan #Siri #Nagarjuna)