Andhrajyothy: ట్రైనీ జర్నలిస్టులు కావాలి

ABN , First Publish Date - 2022-12-16T18:20:40+05:30 IST

Andhrajyothy College of Journalism

Andhrajyothy: ట్రైనీ జర్నలిస్టులు కావాలి

అర్హతలు

  • ఇంగ్లీషు భాషలో వ్యవహారజ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగల నేర్పు

  • వర్తమాన విషయాలపై అవగాహన, విశ్లేషణ సామర్థ్యం

  • సరళమైన తెలుగులో రాయగలగడం

  • చక్కటి భావవ్యక్తీకరణ

  • డిగ్రీ ఉత్తీర్ణత

  • 35 సంవత్సరాలకు మించని వయసు

దరఖాస్తు విధానం

  • మీలో పై అర్హతలన్నీ ఉంటే పూర్తి పేరు, వయసు, విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, ఉద్యోగానుభవం, ఆసక్తులు వగైరా వివరాలన్నిటితో దరఖాస్తు చేయాలి.

  • దరఖాస్తుకు సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులు, ఇటీవల తీసుకున్న రెండు ఫొటోలు జతపరచాలి.

  • దరఖాస్తులోను, కవరుపైన మీ పూర్తి చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పరీక్ష రాయదలచుకున్న కేంద్రం స్పష్టంగా రాయాలి.

  • రాతపరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు ఫోన్‌ ద్వారా మాత్రమే తెలియపరుస్తాం. అందువల్ల మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే మొబైల్‌ నెంబర్‌నే దరఖాస్తులో ఇవ్వాలి.

  • ఏ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు, పాన్‌ ఇండియా సినిమాగా ఎదుగుతున్న తెలుగు సినిమా - ఈ రెండిటిలో ఏదో ఒక అంశంపై సొంతంగా రాసిన వ్యాసాన్ని దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. వ్యాసం లేని దరఖాస్తులను పరిశీలించం.

ఎంపిక

  • అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

  • రాతపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.

  • అభ్యర్థుల ఎంపికలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే తుది నిర్ణయం.

  • శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడేళ్లు పని చేస్తామని హామీపత్రం ఇవ్వాలి.

శిక్షణ

  • ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో కనీసం ఆరునెలల శిక్షణ ఉంటుంది.

  • భాష, భావవ్యక్తీకరణ, వర్తమాన వ్యవహారాలపై అవగాహన, అనువాదం, ఎడిటింగ్‌లలో శిక్షణ ఉంటుంది.

  • శిక్షణ ముగించుకున్నాక ట్రైనీ ఉద్యోగులుగా అవకాశం లభిస్తుంది. వీరు ఆంధ్రజ్యోతి యూనిట్లలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

వేతనం

  • శిక్షణ కాలంలో నెలకు రూ. 11,000

  • శిక్షణ అనంతరం జిల్లా విభాగాల్లో పని చేయడానికి ఎంపికైన వారికి రూ. 16,000

  • హైదరాబాద్‌, విజయవాడల్లోని ముఖ్యవిభాగాల్లో పని చేయడానికి అర్హులైన వారికి పనితీరును బట్టి రూ. 18,000 నుంచి 20,000

దరఖాస్తులు పంపవలసిన చిరునామా

ప్రిన్సిపాల్‌, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్‌, ప్లాట్‌ నెం. 76,

జూబ్లీహిల్స్‌, రోడ్డు నం. 70, హైదరాబాద్‌ - 500 110

దరఖాస్తులు చేరాల్సిన ఆఖరి తేదీ 2022, డిసెంబర్‌ 31.

Updated Date - 2022-12-21T13:23:41+05:30 IST