UAE: ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం స్పెషల్ ఆఫర్.. అలా చేస్తామంటే ఎడాది పాటు పెయిడ్ లీవ్!

ABN , First Publish Date - 2022-12-30T18:47:04+05:30 IST

చాలా మందికి వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకున్నా ధైర్యం చాలదు. రిస్క్ ఎక్కువనే భయంతో ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే వ్యాపారం చేస్తే బాగుండేది అని మనసులో బాధ అలాగే ఉంటుంది. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది.

UAE: ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం స్పెషల్ ఆఫర్.. అలా చేస్తామంటే ఎడాది పాటు పెయిడ్ లీవ్!

చాలా మందికి వ్యాపార రంగంలోకి ప్రవేశించాలనుకున్నా ధైర్యం చాలదు. రిస్క్ ఎక్కువనే భయంతో ప్రభుత్వ ఉద్యోగాల (Government employees) వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే వ్యాపారం చేస్తే బాగుండేదనే బాధ మాత్రం మనసులో అలాగే ఉంటుంది. అలాంటి వారి కోసం యూఏఈ ప్రభుత్వం (UAE government) అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. వ్యాపారం (Business) చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాది పాటు జీతంతో కూడిన సెలవు (1-year paid leave) ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకవేళ వ్యాపారంలో విజయవంతం కాలేకపోతే హ్యాపీగా మళ్లీ వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగులకు యూఏఈ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వరాలు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ బంగారం లాంటి అవకాశం ఇచ్చింది. పని చేయకపోయినా నెల నెలా సగం జీతం తీసుకుంటూ వ్యాపారం చేసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. 2023, జనవరి 1వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ సెలవును వినియోగించుకోవాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2022-12-30T18:47:05+05:30 IST