Yashoda: సమస్య ఓ కొలిక్కి వచ్చింది!
ABN , First Publish Date - 2022-11-29T20:13:19+05:30 IST
సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్న ‘యశోద’ చిత్రానికి ఓ సమస్య వచ్చిన సంగతి తెలిసిందే! సినిమాలో ఇవా హస్పిటల్ పేరు వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వర్గాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఈ వివాదంపై స్పష్ట వచ్చే వరకూ సినిమాను ఓటీటీలో విడుదల చేయకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది.
సక్సెస్‌ఫుల్‌గా ఆడుతున్న ‘యశోద’ (Yashoda)చిత్రానికి ఓ సమస్య వచ్చిన సంగతి తెలిసిందే! సినిమాలో ఇవా హస్పిటల్ (Iva hospital)పేరు వాడటాన్ని వ్యతిరేకిస్తూ ఆస్పత్రి వర్గాలు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే! ఈ వివాదంపై స్పష్ట వచ్చే వరకూ సినిమాను ఓటీటీలో (Ott problem) విడుదల చేయకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది. (Samantha)తాజాగా ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఇకపై సినిమాలో ఇవా పేరు కనిపించదని మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత చెప్పారు. ఈ మేరకు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka krishna prasad)మాట్లాడుతూ ‘‘చట్టప్రకారమే సమస్యను పరిష్కరించుకున్నాం. సినిమాలో ఇవా అనే పేరు కనిపించకుండా బ్లర్ చేస్తాం. ఈ పేరుతో ఆస్పత్రి ఉందని మాకు తెలీదు. ఇది యాదృచ్ఛికంగా జరిగింది. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం కాదు. ఈ విషయం మా దృష్టికి రాగానే సినిమాలో ఆ పేరు బ్లర్ చేసి, పేరు వినిపించే చోట మ్యూట్ చేశాం. సాంకేతిక సమస్యల గురించి ఆలోచించి సమస్యను పరిష్కరించడానికి వారం రోజులు సమయం అడిగాం. ఓటీటీలో యశోద సినిమా టెలికాస్ట్ అయ్యేటప్పుడు ఈ లోగోలు, పేరు ఉండవు. మూడు వారాలుగా సినిమా విజయవంతంగా ఆడుతోంది. ఓటీటీ విడుదల ఎప్పుడు అనేది వచ్చే నెలలో ప్రకటిస్తాం’’ అని చెప్పారు.