Bangladesh vs India: రెండో టెస్టులో రోహిత్ ఆడతాడా?.. రాహుల్ ఏమన్నాడు?
ABN , First Publish Date - 2022-12-18T18:05:21+05:30 IST
చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో స్టాండిన్ కెప్టెన్ కేఎల్ (KL Rahul) సారథ్యంలోని భారత
ఢాకా: చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో స్టాండిన్ కెప్టెన్ కేఎల్ (KL Rahul) సారథ్యంలోని భారత జట్టు 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మూడో వన్డేతోపాటు తొలి టెస్టుకు కూడా దూరమయ్యాడు. మరి రెండో టెస్టుకైనా రోహిత్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై రాహుల్ అప్‌డేట్ ఇచ్చాడు. మరో ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంలో స్పష్టత వస్తుందని పేర్కొన్నాడు. రోహిత్ విషయంలో తనకు కూడా క్లారిటీ లేదన్న రాహుల్.. ఇప్పుడు తమ దృష్టంతా రెండో టెస్టుపైనే ఉందన్నాడు.
రెండో టెస్టు ఈ నెల 22న మీర్పూరు (Mirupur)లో ప్రారంభమవుతుంది. రెండో వన్డేలో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన రోహిత్ బొటన వేలికి గాయమైంది. గాయం తర్వాత మైదానాన్ని వీడిన రోహిత్ ఆ తర్వాత 9వ స్థానంలో క్రీజులోకి వచ్చి 28 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడింది. అయితే, మూడో వన్డేలో భారీ విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ (110) సాధించాడు. రెండో టెస్టుకు కనుక రోహిత్ అందుబాటులోకి వస్తే గిల్ సంగతేంటన్నది వేచి చూడాల్సిందే.