బిష్త్‌ ధరించినందుకు రూ. 8 కోట్లు!

ABN , First Publish Date - 2022-12-25T02:44:09+05:30 IST

గత ఆదివారం ప్రపంచ కప్‌ను అందుకున్నప్పుడు అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ నల్లటి పొడవైన వస్త్రం ధరించాడు.

బిష్త్‌ ధరించినందుకు రూ. 8 కోట్లు!

దోహా: గత ఆదివారం ప్రపంచ కప్‌ను అందుకున్నప్పుడు అర్జెంటీనా కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ నల్లటి పొడవైన వస్త్రం ధరించాడు. ఎమిటది.. ప్రత్యేకమైన డ్రెస్సా అని అంతా ఆలోచించారు. అదేమిటంటే..పెళ్లిళ్లు, పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో అరబ్బులు ‘బిష్త్‌’గా పిలిచే ఈ నల్లటి గౌనును ధరించడం వేల సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. వరల్డ్‌కప్‌ ట్రోఫీ స్వీకరించడానికి ముందు అర్జెంటీనా సారథికి ఆ బిష్త్‌ను ఖతార్‌ చక్రవర్తి తమిమ్‌ బిన్‌ అహ్మద్‌ ధరింపజేశారు. ఒంటె జుత్తు, మేక ఊలుతో రూపొందించిన ఈ బిష్త్‌ ఖరీదు రూ. 1.65 లక్షలు. ఖతార్‌కు చెందిన టేలర్‌ మహ్మద్‌ అబ్దుల్లా దీనిని ప్రత్యేకంగా తయారు చేశాడు. ఆ బిష్త్‌ను ధరించినందుకు మెస్సీకి ఒమన్‌ పార్లమెంట్‌ సభ్యుడు, న్యాయవాది అహ్మద్‌ అల్‌ బర్వానీ ఏకంగా రూ. 8 కోట్లు ఆఫర్‌ చేశారు. ఈ విషయాన్ని బర్వానీ ట్విటర్‌లో వెల్లడించారు. ఈ వస్త్రాన్ని మెస్సీ ధరించడంపై అర్జెంటీనా ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం జేశారు. వరల్డ్‌ కప్‌ అందుకొనే మధుర క్షణాల్లో తమ దేశ జెర్సీ కనపడకుండా బిష్త్‌ ధరించడాన్ని వారు తప్పుబట్టారు.

Updated Date - 2022-12-25T02:44:10+05:30 IST