లక్ష్యసేన్‌పై శ్రీకాంత్ విజయం
ABN , First Publish Date - 2022-10-27T05:34:19+05:30 IST
భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్‌ఎ్‌స ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండోరౌండ్ చేరారు. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి
పారిస్: భారత స్టార్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ, హెచ్‌ఎ్‌స ప్రణయ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండోరౌండ్ చేరారు. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-18, 21-18తో సహచరుడు లక్ష్యసేన్‌పై గెలిచాడు. అన్‌సీడెడ్ సమీర్ 21-15, 21-23, 22-20తో ఆరో సీడ్ ఆంథోనీ సినిసుక గింటింగ్ (ఇండోనేసియా)కు షాకిచ్చాడు. ప్రణయ్ 21-16, 16-21, 21-16తో లీ డారెన్ (మలేసియా)పై నెగ్గాడు. డబుల్స్ తొలి రౌండ్‌లో అర్జున్/ధ్రువ్ జోడీ 15-21, 16-21తో ఐదో సీడ్ ఫజర్/అర్డియంట్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడారు.