ind vs sa odi squad: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ

ABN , First Publish Date - 2022-10-03T03:07:02+05:30 IST

అక్టోబరు 6 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ఆదివారం నాడు ప్రకటించింది. ఈ వన్డే సిరీస్‌కు..

ind vs sa odi squad: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ

ముంబై: అక్టోబరు 6 నుంచి సఫారీలతో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా జట్టును బీసీసీఐ ఆదివారం నాడు ప్రకటించింది. ఈ వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వీరితో పాటు శుభమన్‌, రుతురాజ్‌, రజత్‌ పటిదార్‌, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్‌, సంజూ శాంసన్‌‌తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. షాబాద్‌ అహ్మద్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌, సిరాజ్‌, అవేష్‌ ఖాన్‌, దీపక్‌ చాహర్‌, ముకేశ్‌ కుమార్‌‌కు ఈ వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దక్కింది. ఇదిలా వుండగా మెగా టోర్నీకి ముందు వన్డేలతో ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈ సిరీస్‌కు టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌ ఆటగాళ్లను సెలక్టర్లు దాదాపు దూరం పెట్టేశారు.



ఆ కారణంగానే రోహిత్‌ స్థానంలో శిఖర్‌ ధవన్‌ మరోసారి జట్టు సారథిగా వ్యవహరించబోతున్నాడు. అలాగే కివీస్‌ ‘ఎ’తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో సంజూ శాంసన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌ యాదవ్‌ విశేషంగా రాణించారు. దీంతో ఈ టీమ్‌లో వీరికి కూడా అవకావం కల్పించారు. దక్షిణాఫ్రికాతో అక్టోబర్ 6న తొలి వన్డే, అక్టోబర్ 9న రెండో వన్డే, అక్టోబర్ 11న మూడో వన్డే జరగనుంది. ఈ టీమ్‌లో పృథ్వీషాకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ మూడు వన్డేలు మధ్యాహ్నం 1.30కు జరగనున్నాయి.

Updated Date - 2022-10-03T03:07:02+05:30 IST