India vs South Africa: రాంచీ వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యం.. దక్షిణాఫ్రికా స్కోర్ ఎంతంటే..

ABN , First Publish Date - 2022-10-09T23:05:10+05:30 IST

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa) వన్డే సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

India vs South Africa: రాంచీ వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యం.. దక్షిణాఫ్రికా స్కోర్ ఎంతంటే..

రాంచీ: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా (India vs South Africa) వన్డే సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయిన 278 పరుగులు చేసింది. హెండ్రిక్స్ (74), మార్‌క్రమ్ (79) పరుగులతో రాణించడంతో భారత్‌కు 279 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. పరుగులు నియంత్రించడంతో భారత బౌలర్లు సఫలమైనప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు.  కాగా ఈ గ్రౌండ్‌లో 250కిపైగా పరుగులు చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి భారత్ బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో రాణిస్తారో వేచిచూాడాల్సి ఉంది. 


దక్షిణాఫ్రికా బ్యాటింగ్..

క్వింటన్ డికాక్ (5), మలన్ (25), రీజా హెండ్రిక్స్ (74), మార్‌క్రమ్ (79), క్లాసెన్ (30), డేవిడ్ మిల్లర్ (35 నాటౌట్), పార్నెల్ (16), కేశవ్ మహరాజ్ (5), ఫోర్టున్(0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలింగ్ విషయానికి వస్తే.. భారీగా పరుగులు సమర్పించుకోకపోయినప్పటికీ..  వికెట్లు తీయడంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఖాన్ 3 వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ , షాబాద్ అహ్మద్ , కుల్దీప్ యాదవ్ , శార్ధూల్ థాకూర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

Updated Date - 2022-10-09T23:05:10+05:30 IST