Team India: దక్షిణాఫ్రికాపై టాస్ గెలిచిన టీమిండియా
ABN , First Publish Date - 2022-10-30T16:32:26+05:30 IST
టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు
పెర్త్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup)లో వరుస విజయాలతో జోరుమీదున్న భారత జట్టు మరికాసేపట్లో దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ (Rohith Sharma) మరో మాటకు తావులేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సూపర్-12 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టు.. నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు అదే ఊపుతో దక్షిణాఫ్రికా(South Africa)ను చిత్తు చేసి ముచ్చటగా మూడో విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సెమీస్ అవకాశాలను సజీవం చేసుకోవాలని దక్షిణాఫ్రికా గట్టి పట్టుదలగా ఉంది. భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికా కూడా ఒక్కే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. షంషీ ఈ మ్యాచ్‌కు దూరం కాగా, ఎంగిడి జట్టులోకి వచ్చాడు.