Sri Lanka: ఆఫ్ఘనిస్థాన్‌పై అలవోకగా నెగ్గిన శ్రీలంక
ABN , First Publish Date - 2022-11-01T16:15:37+05:30 IST
టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సూపర్-12 గ్రూప్-1లో ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక
బ్రిస్బేన్: టీ20 ప్రపంచకప్ (T20 World Cup) సూపర్-12 గ్రూప్-1లో ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక(Sri Lanka) అలవోకగా విజయం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 145 పరుగుల విజయ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ధనంజయ డిసిల్వ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 25, చరిత్ అసలంక 19, భానుక రాజపక్స 18 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబుర్ రహ్మన్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ గుర్బాజ్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉస్మాన్ ఘనీ 27, ఇబ్రహీం జర్దాన్ 22, నజీబుల్లా 18, గుల్బాదిన్ 12, కెప్టెన్ నబీ 13 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హసరంగ మూడు వికెట్లు తీసుకోగా, లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో శ్రీలంక గ్రూప్-1లో 4 పాయిట్లతో మూడో స్థానంలో ఉంది. ఓడిన ఆఫ్ఘనిస్థాన్ 2 పాయింట్లతో అట్టడుగున ఉంది.