India-New Zealand 2nd ODI: 29 ఓవర్లకు కుదించిన మ్యాచ్ తిరిగి ప్రారంభం..
ABN , First Publish Date - 2022-11-27T11:45:58+05:30 IST
టీమిండియా-న్యూజిలాండ్(Team India-New Zealand 2nd ODI) జట్ల మధ్య జరుగుతున్న రెండో
హామిల్టన్: టీమిండియా-న్యూజిలాండ్(Team India-New Zealand 2nd ODI) జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌కు వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు రెండో వన్డే మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ 10 నిమిషాలు ఉండనుంది. ఇక డ్రింక్స్ బ్రేక్ ఉండదు. ఎట్టకేలకు గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఈసారైన బ్యాటింగ్ తీరు మారుతుందో లేదో చూడాలి. ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1-0తో లీడ్ లో ఉంది.
ఇక మ్యాచ్ తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్‌కు షాక్ తగిలింది. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన ధావన్ (3) మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి వెనుతిరిగాడు. దీంతో టీమిండియా తొలి వికెట్‌ను 23 పరుగుల వద్ద కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ వికెట్ నష్టానికి 60 రన్స్ చేసింది. క్రీజులో గిల్ 40, సూర్యకుమార్ యాదవ్ 11 రన్స్‌తో కొనసాగుతున్నారు.