T20 World Cup: ఆస్ట్రేలియాను 168 పరుగులకు కట్టడి చేసిన ఆఫ్ఘనిస్థాన్

ABN , First Publish Date - 2022-11-04T15:45:02+05:30 IST

టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్-1లో ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) 20 ఓవర్లలో

T20 World Cup: ఆస్ట్రేలియాను 168 పరుగులకు కట్టడి చేసిన ఆఫ్ఘనిస్థాన్

అడిలైడ్: టీ20 ప్రపంచకప్ సూపర్-12 గ్రూప్-1లో ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకున్న ఆస్ట్రేలియా పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ముఖ్యంగా నవీన్ ఉల్ హక్ బంతులతో ఆసీస్ బ్యాటర్లను భయపెట్టాడు. వార్నర్ (25), స్టీవ్ స్మిత్ (4), కమిన్స్ (0) వికెట్లను పడగొట్టి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు. ఫజల్‌హక్ ఫరూకీ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (45), మ్యాక్స్‌వెల్ (54) రాణించడంతో ఆసీస్ 168 పరుగుల స్కోరు సాధించింది. స్టోయినిస్ 25 పరుగులు చేశాడు.

అనంతరం 169 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ మూడో ఓవర్ మూడో బంతికి 15 పరుగుల వద్ద ఉస్మాన్ ఘనీ (2) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మూడు ఓవర్లు ముగిశాయి. ఆఫ్ఘనిస్థాన్ వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.

Updated Date - 2022-11-04T15:45:05+05:30 IST