టాప్‌-10లో విరాట్‌

ABN , First Publish Date - 2022-10-27T05:32:41+05:30 IST

టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం అందించిన విరాట్‌ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి

టాప్‌-10లో విరాట్‌

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం అందించిన విరాట్‌ కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. బుధవారం విడుదలజేసిన టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్‌లలో విరాట్‌ తొమ్మిదో స్థానం దక్కించుకున్నాడు. బౌలర్లలో భువనేశ్వర్‌ 10వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో మూడు స్థానాలు మెరుగుపర్చుకున్న హార్దిక్‌ పాండ్యా మూడో ర్యాంక్‌ సాధించాడు. పాకిస్థాన్‌ కీపర్‌ రిజ్వాన్‌ బ్యాటర్లలో టాప్‌లో కొనసాగుతుండగా..సూర్యకుమార్‌ను వెనక్కు నెట్టిన కివీస్‌ ఓపెనర్‌ కాన్వే రెండో ర్యాంక్‌ చేజిక్కించుకున్నాడు. సూర్యది మూడో స్థానం.

Updated Date - 2022-10-27T05:32:45+05:30 IST