David Warner: నేనేమైనా క్రిమినల్‌నా?: క్రికెట్ బోర్డుపై వార్నర్ ఫైర్

ABN , First Publish Date - 2022-11-21T21:17:44+05:30 IST

ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఫైరయ్యాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు

David Warner: నేనేమైనా క్రిమినల్‌నా?: క్రికెట్ బోర్డుపై వార్నర్ ఫైర్

మెల్‌బోర్న్: ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఫైరయ్యాడు. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన స్మిత్, వార్నర్‌పై ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేకాకుండా, వార్నర్ తన జీవిత కాలంలో కెప్టెన్ కాకుండా నిషేధించింది. అయితే, సోమవారం ఆసీస్ క్రికెట్ (Cricket Australia) బోర్డు కీలక ప్రకటన చేసింది. కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సవరణలు చేశామని, ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు నిషేధంపై అప్పీలు చేసుకోవచ్చని ప్రకటించింది. ఆసీస్ క్రికెట్ బోర్డు ఒకసారి నిషేధం విధిస్తే దానిని అప్పీలు చేసుకునే అవకాశం ఇప్పటి వరకు ఉండేది కాదు. అయితే, ఇప్పుడు సవరణలు చేయడంతో అప్పీలు చేసుకునే వెసులుబాటు లభించింది.

బోర్డు తాజా ప్రకటనపై డేవిడ్ వార్నర్ (David Warner) తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తానేమీ నేరస్తుడిని కాదని అన్నాడు. తనపై నిషేధం ఉందన్న సంగతి తనకు తెలుసని అన్నాడు. అయితే ఏదో ఒక దశలో అప్పీలు చేసుకునే హక్కు ఉండాలని అన్నాడు. జీవితాంతం నిషేధమంటే కొంచెం కఠినమైన విషయమేనని అన్నాడు. ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా కొనసాగిందని అన్నాడు. ఈ సమయంలో తాను, తన కుటుంబం, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో బాధను అనుభవించారని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక వ్యక్తిపై జీవితకాలంపాటు ఇలాంటి నిషేధం విధించడం చాలా కఠినమైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఇటీవల వరుసగా నాయకత్వ మార్పులు జరిగినా నిషేధం కారణంగా అనుభవజ్ఞుడైన వార్నర్‌కు కెప్టెన్సీ అవకాశం దక్కలేదు.

Updated Date - 2022-11-21T21:48:24+05:30 IST