Apple: రెండు కొత్త ఐప్యాడ్స్ విడుదల
ABN , First Publish Date - 2022-10-27T18:23:29+05:30 IST
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ (Apple) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కొత్త డివైజ్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
హైదరాబాద్: అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ (Apple) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కొత్త డివైజ్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా భారత మార్కెట్‌లో 11 అంగుళాలు, 12.9 అంగుళాల డిస్‌ప్లేలతో రెండు ఐప్యాడ్ ప్రో (2022) (iPad Pro (2022) మోడళ్లను విడుదల చేసింది. కొత్త టాబ్లెట్‌లు Apple M2 ప్రాసెసర్‌తో పని చేస్తాయని సంస్థ తెలిపింది.16-అంగుళాల ఐప్యాడ్ ప్రో మోడల్‌ను కుపెర్టినో కంపెనీ తయారు చేస్తోందని, ఈ టాబ్లెట్ 2023 నాల్గవ త్రైమాసికంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఓ నివేదిక పేర్కొంది.