Samsung India: వేల కోట్లలో దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు

ABN , First Publish Date - 2022-11-05T18:27:36+05:30 IST

ఫెస్టివల్ సీజన్‌ (Festive Season)లో 14,400 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను అమ్మినట్లు శాంసంగ్ ఇండియా (Samsung India)ప్రకటించింది.

Samsung India: వేల కోట్లలో దూసుకెళ్తున్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు
Samsung India

హైదరాబాద్: ఫెస్టివల్ సీజన్‌ (Festive Season)లో 14,400 కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్లను అమ్మినట్లు శాంసంగ్ ఇండియా (Samsung India)ప్రకటించింది. జనవరి- సెప్టెంబర్ మధ్యలో 5జీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 178 శాతం పెరిగినట్లు శాంసంగ్ ఇండియా తెలిపింది. సెప్టెంబర్ - అక్టోబర్ నెలలో ప్రీమియం క్యాటగిరి స్మార్ట్‌ఫోన్లను 99 శాతం విక్రయించినట్లు సంస్థ తెలిపింది. సెప్టెంబర్ 1 నుంచి 60 రోజుల్లో 14,400 కోట్ల విలువైన ఫోన్ల అమ్మకాలు జరిగిపినట్లు సంస్థ వెల్లడించింది. టైర్ 2, 3 పట్టణాల్లో ఫోన్ల అమ్మకాలు పెరిగిందని, అర్బన్ సెంటర్లలో ఫోన్ల అమ్మకాలు బాగా పెరిగాయని కంపెనీ తెలిపింది. 2022 సంవత్సరంలో తొలి నెలలపాటు ఫోన్ల అమ్మకాలు 20 నుంచి 22 శాతం రెవెన్యూ ఆదాయం పెరిగిందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2022-11-05T18:41:08+05:30 IST