విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలి
ABN , First Publish Date - 2022-10-25T23:39:14+05:30 IST
పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు.
- ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా ఉండాలి
- కలెక్టర్ కోయ శ్రీహర్ష
- ఆకస్మికంగా పాఠశాలల తనిఖీ
ఊట్కూర్, అక్టోబరు 25 : పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తిప్రస్‌పల్లి, ఊట్కూర్, మగ్దుంపూర్, పులిమామిడి, బిజ్వార్, అవుసులోన్‌పల్లి, పెద్దజట్రం, నిడుగుర్తి గ్రామ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మన ఊరు - మన బడిలో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను తనిఖీ చేసి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. వాటర్ సంప్, లైటింగ్, ప్రహారి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తిప్రస్‌పల్లి పాఠశాలలో అధిక శాతం విద్యార్థులు గైర్హాజరు కావడంతో హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలకు ప్రతీ రోజు విద్యార్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వచ్చామమా? పోయామా? అని కాకుండా విధుల పట్ల బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. 3, 4, 5వ తరగతి విద్యార్థులకు అంకూర్ స్వచ్ఛం ద సంస్థ నిర్వహిస్తున్న గ్రూప్ ఇంగ్గిష్ తరగతులను పరిశీలించి విద్యార్థుల చేత రైమ్స్ చదవించారు. అలాగే తన చేతి గడియారాన్ని చూపించి సమయం ఎంత అయ్యిందని అడిగారు. ప్రతీ విద్యార్థికి ఓక యాక్షన్ ప్లాన్ ఉంటేనే వారి ప్రతిభ తె లుస్తోందన్నారు. అనంతరం ఊట్కూర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న 4, 5, 8, 12 అం గన్‌వాడీ కేంద్రాలను సందర్శించి తక్కువ బరువు కలిగిన పిల్లలు ఉన్నారా అని అడిగారు. ప్రతీ రోజు పిల్లలకు కోడి గుడ్లు ఇవ్వాలన్నారు. బిజ్వార్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ రోజు స్టడీ ఆవర్స్, వారానికి ఒక సారి టెస్టులను పెట్టుతున్నారా అని అడిగారు. ఈ సంవత్సరం అందరు పదికి పది సాధించాలని చెప్పాగానే అందరు సాధిస్తామని చెతులు ఎత్తారు. పదికి పది సాధిస్తే బహుమతులు ఇస్తామన్నారు. పులిమామిడి ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలను సందర్శించి అదనపు గదుల నిర్మాణ పనులను పూర్తి చేసి వెంటనే ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, డీఈ రాము, ఏఈ జగత్‌చంద్ర, ఎంపీడీవో కాళప్ప, ఏపీవో వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌గౌడ్, ఎంపీపీ ఎల్కోటీ లక్ష్మి, ఊట్కూర్, బిజ్వార్, పులిమామిడి, పెద్దజట్రం సర్పంచులు సూర్యప్రకాష్‌రెడ్డి, సావిత్రమ్మ, సూరయ్యగౌడ్, కతలప్ప, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ధన్వాడ : ధన్వాడ సంతబజార్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ శ్రీహర్ష మంగళవారం తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అంకూర్ సంస్థ ఆధ్వర్యంలో 3, 4, 5వ తరగతి వి ద్యార్థులకు నిర్వహిస్తున్న ఇంగ్లిషు క్లాసులను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎం రమేష్, హెచ్‌ఎం కెంచె బాల్‌రాజు, మరికల్ శ్రీనివాసులు పాల్గొన్నారు.