ట్విటర్‌లో ఆకతాయిలు వేధిస్తున్నారు
ABN , First Publish Date - 2022-08-30T08:46:55+05:30 IST
కొంతమంది వ్యక్తులు తనను పనిగట్టుకొని ట్విటర్ వేదికగా వేధిస్తున్నారని, అసభ్య పదాలతో దూషిస్తున్నారని నటి, యాంకర్ అనసూయ ట్విటర్‌లో పేర్కొంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..
పోలీసులకు నటి అనసూయ ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కొంతమంది వ్యక్తులు తనను పనిగట్టుకొని ట్విటర్ వేదికగా వేధిస్తున్నారని, అసభ్య పదాలతో దూషిస్తున్నారని నటి, యాంకర్ అనసూయ ట్విటర్‌లో పేర్కొంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. కొంతమంది ట్విటర్ వేదికగా తనను టార్గెట్ చేసి అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానని తెలిపింది. కొద్ది రోజులుగా నటుడు విజయ్‌దేవరకొండ అభిమానులకు, యాంకర్ అనసూయకు మధ్య ట్విటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.