తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై దాడి
ABN , First Publish Date - 2022-05-23T01:35:29+05:30 IST
తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar)పై మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి..
సూర్యాపేట: తుంగతుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ (Addanki Dayakar)పై మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి (Damodara Reddy) వర్గీయులు దాడి చేశారు. కొంతకాలంగా దామోదర్‌రెడ్డి, దయాకర్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇటీవల కాలంలో దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరిపై ఏఐసీసీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.
దీంతో అద్దంకి దయాకర్‌పై దామోదర్‌రెడ్డి వర్గీయులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కొండరాజు (Konda Raju) వివాహానికి హాజరైన అద్దంకి దయాకర్‌పై దాడి చేశారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఇదిలా ఉంటే అద్దంకి దయాకర్‌పై జరిగిన దాడిని దళిత సంఘాలు ఖండించాయి. దామోదర్ రెడ్డి వర్గీయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.