Anjani Kumar: తెలంగాణ కొత్త ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్

ABN , First Publish Date - 2022-12-29T16:36:23+05:30 IST

తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్‌ నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా,

Anjani Kumar:  తెలంగాణ కొత్త ఇంఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
Telangana New Incharge DGP

హైదరాబాద్: తెలంగాణ ఇన్‌చార్జ్‌ డీజీపీగా అంజనీకుమార్‌ ((Anjani Kumar)) నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్‌, ఏసీబీ డీజీగా రవిగుప్త, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్‌, లా అండ్ ఆర్డర్‌ డీజీగా సంజయ్‌కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి (Director General of Police Telangana M Mahender Reddy) పదవి కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తరవాత డీజీపీ(DGP) ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠ వీడినట్లైంది.

1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ ఇప్పటిదాకా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరక్టర్ జనరల్‌గా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అడిషనల్ డీజీపీగా కూడా వ్యవహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో కొన్ని వారాల పాటు మెడికల్ లీవ్ పెట్టినప్పుడు అంజనీ కుమార్‌ ఇంఛార్జ్ డీజీపీగా పనిచేశారు కూడా.

అంజనీ కుమార్ ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్ (పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు.

ఐక్యరాజ్య సమితి తరపున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు.

బిహార్ రాజధాని పట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, దిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు.

ఐపిఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు.

గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు.

కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్ గా పనిచేశారు

ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్ గా పనిచేశారు

నిజామాబాద్ డీఐజీగా చేశారు

వరంగల్ ఐజీగా చేశారు

హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా చేశారు

తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు.

2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా చేరారు.

2021 డిసెంబరు 25న ఏసీబీగా డీజీగా నియమితులయ్యారు.

రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ, ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు.

హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.

జితేందర్ (Jitender) గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీగా పని చేశారు. ఇప్పటివరకూ శాంతి భద్రతల అడిషనల్ డీజీగా పని చేశారు.

1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా (Ravi Gupta) గతంలో ఆయన డీఐజీ, ఐజీగా పనిచేశారు.

Updated Date - 2022-12-29T17:52:48+05:30 IST