Home » Telangana DGP
Telangana: ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
హైదరాబాద్, జులై 19: పోలీసు సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్ చేసి సామాన్య ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న మోసగాళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన..
తెలుగు ప్రజలకు తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం తెలంగాణ రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గవర్నర్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మరింత దూకుడుగా వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనికుమార్, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ ఆఫీసర్స్ నివాళులర్పించారు.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ విభాగం అప్రమత్తం అయ్యింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం రాష్ట్రంలో జిల్లాల పోలీస్ అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తెలంగాణ పోలీసు శాఖ(Telangana Police Department)లో 51 మంది డీఎస్పీలు(DSP) నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) ఉత్తర్వులు జారీ చేశారు.
అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కేఏ.పాల్ కలిశారు. జూన్ 23న తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై
రంజాన్ (Ramdan) తర్వాత ముస్లింల ప్రధాన పండుగ బక్రీద్ (Bakrid). జూన్-27న ముస్లింలు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLa Rajasingh).. డీజేపీ అంజనీకుమార్‌కు (DGP Anjani Kumar) లేఖ రాశారు.
పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై కేసు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. హరగోపాల్ సహా ఇతరుల మీద పెట్టిన యూఏపీఏ కేసును వెంటనే ఎత్తివేయాలని డీజీపీ అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. హర గోపాల్, లేట్ జస్టిస్ సురేష్, జర్నలిస్ పద్మజా షాలపై ఉపా కేసులు ఎత్తి వేయాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తం 152 మందిలో కేవలం ముగ్గురు మీద మాత్రమే కేసు ఎత్తివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మిగితా వారికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.