అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్
ABN , First Publish Date - 2022-12-31T12:12:35+05:30 IST
అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ అయ్యాడు. నేడు వరంగల్‌లో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు.
వరంగల్ : అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్ అయ్యాడు. నేడు వరంగల్‌లో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. అయ్యప్పస్వామిపై బైరి నరేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అయ్యప్పస్వాములతో పాటు పలువురు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు. నడిరోడ్డుపై బైరి నరేష్ అనుచరుడు శంకర్‌పై దాడి చేశారు. నరేష్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప భక్తుల ధర్నాలకు దిగారు. బైరి నరేష్‌పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి బైరి నరేష్ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు నేడు వరంగల్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.