Hyderabad: బంజారాహిల్స్ DAV స్కూల్‌పై అధికారుల నిర్ణయం ఏంటంటే...?
ABN , First Publish Date - 2022-11-01T17:43:36+05:30 IST
బంజారాహిల్స్ DAV స్కూల్ అనుమతిని పునరుద్ధరించిన విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అధికారులు అంగీకరించారు.
హైదరాబాద్: బంజారాహిల్స్ DAV స్కూల్ అనుమతిని పునరుద్ధరించిన విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు అధికారులు అంగీకరించారు. ఈ విద్యా ఏడాదికి తాత్కాలిక అనుమతి ఇచ్చింది. చిన్నారిపై లైంగిక దాడి ఘటన నేపథ్యంలో విద్యాశాఖ గుర్తింపు రద్దు చేసింది. విద్యాశాఖ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ డీఈవోను ఆదేశించారు. విద్యాశాఖ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటికిప్పుడు పాఠశాల గుర్తింపును రద్దు చేస్తే తమ పిల్లలను ఎక్కడికి పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దాదాపు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.