Basara temple: బాసరలో ఘనంగా మూలానక్షత్ర వేడుకలు
ABN , First Publish Date - 2022-10-02T12:57:18+05:30 IST
బాసర సరస్వతీ దేవి క్షేత్రంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి
నిర్మల్: బాసర సరస్వతీ దేవి క్షేత్రంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెల్లవారు జామున 3 గంటల నుంచే దర్శనం ప్రారంభమైంది. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు మూలనక్షతం రోజున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా...వేల సంఖ్యలో భక్తులు తరలిస్తున్నప్పటికీ ఆలయంలో కనీస సౌకర్యాలు లేక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.