Bandi Sanjay Reddy: ఇక కేసీఆర్ దుకాణం బంద్ అయినట్టే
ABN , First Publish Date - 2022-08-21T03:31:20+05:30 IST
ఇక కేసీఆర్ దుకాణం బంద్ అయినట్టేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలోని..
జనగామ: ఇక కేసీఆర్ దుకాణం బంద్ అయినట్టేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యానించారు. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangram Yatra) జిల్లాలోని మీదికొండలో జరిగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ రోడ్ షోలో నిర్వహించారు. మునుగోడు సభకు లక్షల మందిని తరలిస్తామన్నారని, జనం లేక కుర్చీలు ఖాళీగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ (Telangana)లో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్‌కు పేదలంటే కోపమని.. పేదల రాజ్యాధికారం కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ అన్నారు.
కాగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ఇవాళ స్టేషన్ ఘనపూర్ మండలంలో జరిగింది. ఈ యాత్రలో ఆయన ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ రాత్రికి మీదికొండలో బస చేయనున్నారు. ఆదివారం ఉదయం మునుగోడుకు బయలుదేరి వెళ్లనున్నారు. బీజేపీ(Bjp) నిర్వహించే సభకు ఆయన హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రజా సంగ్రామ యాత్రకు విరామం ఇవ్వనున్నారు. మళ్లీ సోమవారం యధావిధిగా నిర్వహించనున్నారు.
ఇవాళ సీఎం కేసీఆర్ (Cm Kcr) మునుగోడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ అగ్ర నేతలపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఆదివారం జరిగే బీజేపీ సభలో సీఎం కేసీఆర్‌కు బీజేపీ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.