Cable bridge: అరుదైన గుర్తింపు
ABN , First Publish Date - 2022-10-08T17:46:48+05:30 IST
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనకు అరుదైన గుర్తింపు దక్కింది. ఇండియన్ చాప్టర్ ఆఫ్ అమెరికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంక్రీట్
మౌలిక సదుపాయాల కల్పనలో రెండో స్థానం
హైదరాబాద్ సిటీ: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ కారిడార్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనకు అరుదైన గుర్తింపు దక్కింది. ఇండియన్ చాప్టర్ ఆఫ్ అమెరికా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాంక్రీట్ (ఏఐసీ) ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన కేటగిరీలో రెండో స్థానంలో నిలిచింది. నిర్మాణ సంస్థ(ఎల్‌అండ్‌టీ) ప్రతినిధులు ఈ మేరకు ఎక్సలెన్స్ ఇన్ కాంక్రీట్ కన్‌స్ట్రక్షన్ అవార్డు 2021ను అందుకున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ)లో భాగంగా దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మించారు. ఎక్‌ట్రా డోస్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నిర్మించిన వంతెన రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చింది. ఏసియాలోనే అతిపెద్ద స్పాన్‌తో నిర్మించిన వంతెన ఇదే అని అధికారులు గతంలో ప్రకటించారు. వంతెన పొడవు 425.85 మీటర్లుకాగా.. అప్రోచ్ రోడ్లతో కలిపి 764.38 మీటర్లు. వాహనాల రాకపోకల కోసమే కాకుండా, పర్యాటక ప్రాం తంగా ప్రభుత్వ విభాగాలు వంతెనను అభివృద్ధి చేశాయి. నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సిగలో ఆధునిక ఐకానిక్ స్ట్రక్చర్‌గా కేబుల్ వంతెన చేరింది. ఫుట్‌పాత్, సైక్లింగ్ ట్రాక్ వంతెనపై ఉన్నాయి. ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శించేందుకు 25 రకాల థీమ్‌లతో లైటింగ్ ఏర్పాటు చేశారు.