Kishan Reddy challenges Cm Kcr: సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్
ABN , First Publish Date - 2022-09-18T02:51:52+05:30 IST
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వారం రోజుల్లో జీవో ఇస్తామని.. కేంద్రం అమలు చేస్తుందో.. ఉరి వేసుకుంటుందోనన్న....
హైదరాబాద్ (Hyderabad): గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ వారం రోజుల్లో జీవో ఇస్తామని.. కేంద్రం అమలు చేస్తుందో.. ఉరి వేసుకుంటుందోనన్న సీఎం కేసీఆర్ (Cm Kcr) వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Central Minister Kishan Reddy) సవాల్ చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ (Bjp) అధికారంలోకి వచ్చిన మెదటిరోజే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి.. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ పోడు భూములు గురించి మాట్లాడం సిగ్గుచేటని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ళ తర్వాత కేసీఆర్‌కు గిరిజనులు గుర్తొచ్చారని అని ఎద్దేవా చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు (High Court) తీర్పు ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ వైఎస్ రాజశేఖరరెడ్డి (Ys Rajashekara Reddy) ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చాడని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మాటలకు గిరిజన సమాజం మోసపోవద్దని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.