Chiranjeevi: పవన్ రాజకీయ జీవితంపై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-11-20T15:44:20+05:30 IST
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మనస్సు నుంచి రాకపోతే దేనిఅంతూ నేను చూడలేను. నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
హైదరాబాద్: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా మనస్సు నుంచి రాకపోతే దేనిఅంతూ నేను చూడలేను. నేను చూడని ఆ అంతు ఏమిటో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని వెనక్కి వచ్చేశాను. రాజకీయాల్లో రాణించాలంటే సెన్సిటివ్ (Sensitive)గా ఉండకూడదు. రాజకీయాల్లో మొరుటుతేలాలి.. బాగా రాటుతేలాలి. ఇతరులను మాటలు అనాలి.. అనిపించుకోవాలి.. ఇది నాకు అవసరమా?.. దానికి పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) తగినవాడు.. తాను అంటాడు.. అనిపించుకుంటాడు. పవన్‌కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో పవన్ ఏదో ఒకరోజు అత్యున్నత స్థానంలో ఉంటాడు’’ అని చిరంజీవి జోస్యం చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు సినిమాల్లో సంచలనం. ఆయనకు విజయవంతమైన నటుడిగా గుర్తింపు ఉంది. సినిమాల్లో సక్సెస్ సాధించిన చిరంజీవి.. రాజకీయాల్లో మాత్రం మూణాళ్ల ముచ్చటగానే ప్రయాణం సాగింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా సినిమాల్లో బిజీ అయిపోయారు. రాజకీయ వివాదాలకు చిరంజీవి దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో ‘‘ నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయాలు నా నుంచి దూరం కాలేదు" అని చిరంజీవి వ్యాఖ్యానించారు. తాజాగా రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమనే భావనకు ఆయన వచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.