KCR meeting: కేసీఆర్ సభకు భారీగా తరలొచ్చిన జనం
ABN , First Publish Date - 2022-09-06T01:12:56+05:30 IST
నిజామాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR) బహిరంగ సభకు జనాలు భారీగా తరలొచ్చారు.
కామారెడ్డి: నిజామాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ (CM KCR) బహిరంగ సభకు జనాలు భారీగా తరలొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) నలుమూలల నుంచేకాకుండా జగిత్యాల, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున వచ్చారు. పట్టణ శివారులోని బైపాస్ రోడ్ సమీపంలో ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల మైదానంలో సుమారు లక్ష మందికి పైగా జనాలు వచ్చేవిధంగా టీఆర్ఎస్ (TRS) ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ఈ సభకు సుమారు 80వేల నుంచి లక్ష మంది వరకు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలొచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఆర్టీసీ బస్సులతో పాటు పలు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను ఏర్పాటు చేసి ప్రజలను సభకు తరలించారు. దీంతో సభా ప్రాంగణం జనసందోహంతో నిండిపోయింది. సీఎం కేసీఆర్ స్పీచ్ ఇస్తున్న సమయంలో కేంద్రం, మోదీపై నిప్పుల వర్షం కురిపించిన సమయంలో జనాలు, టీఆర్ఎస్ శ్రేణులు ఈలలు వేస్తూ హంగామా చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభ విజయవంతం కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లోని జోష్ నెలకొంది.