దీపావళి సందడి

ABN , First Publish Date - 2022-10-23T23:16:41+05:30 IST

చీకటిని చీల్చుతూ వెలుగులను నింపే దీపావళి వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.

దీపావళి సందడి
వికారాబాద్‌లో టపాసుల దుకాణాల వద్ద సందడి

టపాసులు, మిఠాయి దుకాణాల వద్ద రద్దీ

కొనుగోళ్లు, అమ్మకాలతో మార్కెట్లో పండుగ కళ

వికారాబాద్‌/ఘట్‌కేసర్‌, అక్టోబరు 23: చీకటిని చీల్చుతూ వెలుగులను నింపే దీపావళి వేడుకలు జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. టపాసులు, స్వీట్లు, పూలు కొనుగోలు చేస్తున్నారు. లక్ష్మీపూజల కోసం దుకాణాల వద్ద బారులుతీరారు. వికారాబాద్‌లోని చిగుళ్లపల్లి మైదానంలో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేయడంతో భారీగా పటాకులు కొంటున్నారు. వాటి ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే కొనుగోలు చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని పూలు, ప్రమిదలు, బొమ్మల విక్రయాలతో ఘట్‌కేసర్‌లో సందడి నెలకొంది. అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌ వరకు పాత జాతీయ రహదారిపై అమ్మకాలతో రహదారి దర్దీగా మారింది. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా దుకాణాలతో నిండిపోయింది. క్రాకర్స్‌ దుకాణాలు సైతం పదుల సంఖ్యలో వెలిశాయి. కోనుగులుదారులతో పట్టణం కిటకిటలాడింది.

Updated Date - 2022-10-23T23:16:42+05:30 IST