MLAS purchase case: బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2022-11-23T16:11:26+05:30 IST

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAS purchase case)లో సిట్‌ నోటీసులపై హైకోర్టు విచారణ జరిగింది. హైకోర్టు (High Court)కు సుప్రీంకోర్టు ఆర్డర్‌ కాపీని ప్రభుత్వం అందజేసింది.

MLAS purchase case: బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAS purchase case)లో సిట్‌ నోటీసులపై హైకోర్టు విచారణ జరిగింది. హైకోర్టు (High Court)కు సుప్రీంకోర్టు ఆర్డర్‌ కాపీని ప్రభుత్వం అందజేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌‌కు మరోసారి సీఆర్పీసీ నోటీసులివ్వాలని, సిట్‌ అధికారులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ-మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా నోటీసులు పంపాలని ధర్మాసనం పేర్కొంది. అరెస్ట్‌ చేయొద్దన్న ఆర్డర్‌ను ఎత్తివేయాలని కోర్టును అడిషనల్‌ ఏజీ కోరారు. అయితే అడిషనల్‌ ఏజీ అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు తెలిపింది. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ (Moinabad Farmhouse)లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సిట్ నోటీసులిచ్చింది. బీఎల్‌ సంతోష్‌, కేరళకు చెందిన తుషార్‌, కేరళ వైద్యుడు జగ్గు స్వామి సిట్‌ విచారణకు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన రామచంద్ర భారతి, నందు, సింహయాజి విచారణలో రాబట్టిన అంశాలు.. సోదాల్లో సేకరించిన ఆధారాల మేరకు బీఎల్‌ సంతోష్‌, తుషార్‌, జగ్గు స్వామికి సిట్‌ నోటీసులు జారీ చేసింది.

Updated Date - 2022-11-23T16:11:27+05:30 IST