TS News.. రైతుల కోసం కళ్లాలు కడితే కేంద్రం తప్పు అంటోంది: మంత్రి హరీష్
ABN , First Publish Date - 2022-12-22T14:51:23+05:30 IST
హైదరాబాద్: మంత్రి హరీష్ రావు (Minister Harishrao) కేంద్ర ప్రభుత్వం (Central Govt.)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: మంత్రి హరీష్ రావు (Minister Harishrao) కేంద్ర ప్రభుత్వం (Central Govt.)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతుల కోసం కళ్లాలు కడితే కేంద్రం తప్పు అంటోందని.. ఆ డబ్బులు వాపస్ ఇవ్వమని అడుగుతోందని మండిపడ్డారు. రైతులపై ఎందుకు అంత కక్ష అని ప్రశ్నించారు. చేపలు ఎండ పెట్టుకోడానికి కళ్లం కడితే ఒప్పు.. రైతుల కోసం కడితే తప్పా.. ఇదెక్కడి ద్వంద్వ నీతి అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని, కేంద్ర వైఖరికి నిరసనగా రేపు (శుక్రవారం) అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపిచ్చారు.
మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు రూ. 30 వేల కోట్లు రాకుండా కేంద్రం ఆపిందని హరీష్ రావు ఆరోపించారు. ఉపాధి హామీ కింద కాల్లాలు కట్టుకునే అవకాశం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ కూలీల పొట్ట కొడుతున్నారని, సమయానికి వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఉపాధి హామీ చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తోందని, కేంద్రం దిగివచ్చే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.