సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎఫ్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ డా. హరీశ్ తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని హరీశ్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రతీక్ బట్‌తోపాటు చంద్రపాలక జయసూర్య అనే మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. నిందితుడు ప్రతీక్ బట్ ఓ సంస్థలో సూపర్ వైజర్‌గా పని చేస్తూ మత్తుపదార్థాలు అమ్ముతున్నట్లు కమిషనర్ వెల్లడించారు.
Weather Report: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో వాతావరణంలో తేమ సైతం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఓ విధమైన అసౌకర్యానికి గురవుతున్నారు. అలాంటి వేళ.. వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు ఓ తీపి కబురు చెప్పింది. ఉరుములు, మెరుపుతో వర్షాలు కురుస్తాయిన వాతవరణ కేంద్రం వెల్లడించింది.
ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి సంబంధించిన ఏఐ ఫొటోను తన ఎక్స్ ఖాతాలో రీపోస్ట్ చేయడంతో ఆమెకు నోటీసులు అందించారు.
Hyderabad Drug Bust: నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది. గచ్చిబౌలిలో పెద్దఎత్తున డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Kancha Gachibowli land Issue: సుప్రీంకోర్టు ఉత్తర్వులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణ పర్యావరణ పరిరక్షణకు గొప్ప ఊతమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. గొంతులేని మూగజీవాల కోసం, చెట్ల కోసం, పర్యావరణం కోసం అండగా నిలబడిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు.
గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. వాటి ఆధారంగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రావును విచారిస్తున్నారు. గొర్రెల స్కాంలో దళారులు మొయినుద్దీన్, ఈక్రముద్దీన్‌పై అధికారులు అరా తీస్తున్నారు.
Faheem Fake Letter Controversy: హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎం.ఏ ఫహీమ్.
Supreme Court: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంలో విచారణ జరుగగా.. ప్రభుత్వంపై ధర్మాసనం సీరియస్ అయ్యింది. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని జస్టిస్ గవాయ్ హెచ్చరించారు.
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో ఎన్‌ఫోర్స్‌నమెంట్ డైరక్టరేట్ అధికారులు రెండోసారి సోదాలు చేస్తున్నారు. సురానా ఇండస్ట్రీస్ లిమిటెడ్, M/s సురానా కార్పొరేషన్ లిమిటెడ్, M/s సురానా పవర్ లిమిటెడ్, కంపెనీల ఇద్దరు ప్రమోటర్లు, ఇతర అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ (PMLA) కింద ఈడీ కేసు నమోదు చేసింది.