Talasani: రేపు అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

ABN , First Publish Date - 2022-12-23T13:12:06+05:30 IST

కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లో కైకాల

Talasani: రేపు అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు
అధికారిక లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు

హైదరాబాద్: కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) తెలిపారు. ఫిల్మ్‌నగర్‌లో కైకాల భౌతికకాయాన్ని మంత్రి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కైకాల అంత్యక్రియలు ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్(cm kcr) ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు సీఎస్‌కు అదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కైకాల మూడు తరాల నటుడు.. గొప్ప వ్యక్తి అని మంత్రి తలసాని కొనియాడారు.

Updated Date - 2022-12-23T13:13:56+05:30 IST