Rohit Reddy: బండి సంజయ్ నా సవాల్‌ను స్వీకరించ లేదు..

ABN , First Publish Date - 2022-12-18T13:28:39+05:30 IST

హైదరాబాద్: తాను చేసిన సవాల్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్వీకరించలేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Rohit Reddy) అన్నారు.

Rohit Reddy: బండి సంజయ్ నా సవాల్‌ను స్వీకరించ లేదు..

హైదరాబాద్: తాను చేసిన సవాల్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్వీకరించలేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Rohit Reddy) అన్నారు. ఆదివారం చార్మినార్ (Charminar) భాగ్యలక్ష్మి టెంపుల్‌ (Bhagyalakshmi Temple) వద్దకు వచ్చిన ఆయన మాట్లాడుతూ బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉందని ఆరోపణలు చేశారని.. దీనిపై ఆధారాలతో భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రావాలని నిన్న బండి సంజయ్‌కి సవాల్ విసిరానని అన్నారు. తన సవాల్‌ను స్వీకరించలేదన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు.

బండి సంజయ్ ఆరోపణల్లో నిజం లేదని రోహిత్‌రెడ్డి అన్నారు. కర్ణాటక పోలీసులు తనను ఎప్పుడూ విచారణకు పిలవలేదని, తన పేరు ఎఫ్ఐఆర్‌లో లేదని చెప్పారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మతం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. పరిశ్రమ యజమానులను ఎమ్మెల్యే రఘనందన్ బెదిరంచలేదా? అని ప్రశ్నించారు. వందల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు. న్యాయం కోసం వచ్చిన ఓ మహిళను కాటు వేశారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలతో టార్గెట్ చేస్తున్నారని రోహిత్‌రెడ్డి మండిపడ్డారు.

Updated Date - 2022-12-18T13:28:42+05:30 IST