YS Vijayamma: ఇంతటి నిర్బంధం, అణచివేత ఎక్కడా చూడలేదు

ABN , First Publish Date - 2022-12-09T20:27:40+05:30 IST

Hyderabad: వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తల్లి వైఎస్ విజయమ్మ సీఎం కేసీఆర్‌ (CM KCR)పై తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల చేపడుతున్న ప్రజా ప్రస్థానం

YS Vijayamma: ఇంతటి నిర్బంధం, అణచివేత ఎక్కడా చూడలేదు

Hyderabad: వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తల్లి వైఎస్ విజయమ్మ సీఎం కేసీఆర్‌ (CM KCR)పై తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల చేపడుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆమె తొలుత ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని తన నివాసం లోటస్ పాండ్‌కు తరలించారు. అక్కడ తిరిగి ఆమె నిరాహార దీక్షకు పూనుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ బీఆర్ఎస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏబీఎన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

‘తెలంగాణ‌లో ఉన్నంత నిర్బంధ కాండ, అణచివేత దేశంలో ఎక్కడా లేవు. షర్మిలను కేసీఆర్ భయపెట్టాలని చూస్తే భయపడే రకం కాదు. పోలీసులు, సీఎం ఎంత అణచివేయాలని చూస్తే షర్మిల అంత ప్రజల పక్షాన నిలబడే మనిషి. ఏపీలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా.. అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగలేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ప్రతిపక్షాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ తెలంగాణలో మహిళ అన్న గౌరవం లేకుండా ఇలా నిర్బంధించడం ఒక్క కేసీఆర్‌కే చెల్లింది. పాదయాత్ర‌కు అనుమతి ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు.’ అని అన్నారు.

Updated Date - 2022-12-09T20:27:41+05:30 IST