Home » YS Sharmila
కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరికాయలు కొట్టే ప్రాజెక్టుగా మారిపోయిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం మారిన ప్రతిసారీ నూతన ముఖ్యమంత్రి టెంకాయ కొట్టడం ఆనవాయితీ అయిపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, వైఎస్ విజయలక్ష్మిపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మహిళల భద్రతకు పెద్దపీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్ష పడలేదని వైఎస్ షర్మిల అన్నారు. కేసులు ఛేదించాల్సిన పోలీసులను కక్ష్యసాధింపు రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో గ్రూప్-1 అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని వైఎస్ షర్మిల అన్నారు. ఆ అధికారాన్ని ఉపయోగించి 1:100 రేషియో ప్రకారం అవకాశం ఇవ్వమని గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందంటూ ఆమె చంద్రబాబుకు తెలిపారు.
ఈపీఎస్ 95 ఫించన్లదార్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చి రెండేళ్లు అయినా కేంద్రం చర్యలు చేపట్టక పోవడం ఏమిటని కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. ఆ క్రమంలో కేంద్ర మంత్రులకు ఆమె లేఖ రాశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ బడ్జెట్‌పై చేసిన కామెంట్స్‌కు APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు.
108 వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఎక్యూప్మెంట్ సమకూర్చకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల ఆరోపించారు. వాహనాల్లో సమస్యలు వస్తే కనీసం రిపేర్ చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆమె మండిపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసు నమోదు చేసేందుకు ఆమె పులివెందుల చేరుకున్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. వైసీపీ సోషల్ మీడియాను సైతాన్ సైన్యంతో పోల్చారు.
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశానికి కూడా జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపే బాధ్యత జగన్‌కు లేదా అని నిలదీశారు. అసెంబ్లీకి వెళ్లకుంటే రాజీనామా చేయాలని షర్మిల కోరారు.