YS Sharmila: పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష విరమించను

ABN , First Publish Date - 2022-12-09T19:14:29+05:30 IST

Hyderabad: వైఎస్సా‌ర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ లోటస్‌పాండ్‌ సమీపంలోని ఉన్న తన కార్యాలయం వద్ద రెండు గంటలుగా

YS Sharmila: పాదయాత్రకు అనుమతి ఇచ్చేవరకు దీక్ష విరమించను

Hyderabad: వైఎస్సా‌ర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తన పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ లోటస్‌పాండ్‌ సమీపంలోని ఉన్న తన కార్యాలయం వద్ద రెండు గంటలుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తన ‘ప్రజాప్రస్థానం’ యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ తొలుత ఆమె ట్యాంక్‌బండ్‌పై ఉన్న డా. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. అక్కడే దీక్షకు కూర్చోవడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి తన ఇంటి వద్ద వదిలిపెట్టారు. అక్కడ కూడా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె ఏబీఎన్‌తో మాట్లాడారు. ‘‘నా పాదయాత్రకు హై కోర్టు అనుమతి ఇచ్చినా.. పోలీసులు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు. ప్రభుత్వం, పోలీసులు సమాధానం చెప్పే వరకు నా పోరాటం ఆగదు. నాకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక నన్ను నిర్బంధించాలని చూస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు నా పోరాటం కొనసాగుతుంది. నా ఇంట్లో నిరసన తెలిపే హక్కు నాకు ఉంది. మహాత్మా గాంధీ తన ఇంట్లో నిరసన తెలిపినట్టే నేనూ దీక్ష చేస్తున్నా. నా పోరాటం ఫలించే వరకు ఆమరణ నిరాహారదీక్ష విరమించను.’’ అని అన్నారు.

Updated Date - 2022-12-09T19:14:30+05:30 IST