TS News: రెండేళ్ల‌లో ‘ధరణి’లో రూ. 26 లక్షల లావాదేవీలు

ABN , First Publish Date - 2022-11-04T18:38:03+05:30 IST

Hyderabad: ధరణి (Dharani) పోర్టల్‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాక గడిచిన‌‌‌‌‌‌‌‌ రెండేళ్లలో రూ. 26 లక్షల లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ధరణి.. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ సేవలను అందించే వినూత్న, అత్యాధునిక ‘సిటిజెన్ ఫ్రెండ్టీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్’ అని ప్రశంసించింది.

TS News: రెండేళ్ల‌లో ‘ధరణి’లో రూ. 26 లక్షల లావాదేవీలు

Hyderabad: ధరణి (Dharani) పోర్టల్‌‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాక గడిచిన‌‌‌‌‌‌‌‌ రెండేళ్లలో రూ. 26 లక్షల లావాదేవీలు జరిగినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ధరణి.. రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ సేవలను అందించే వినూత్న, అత్యాధునిక ‘సిటిజెన్ ఫ్రెండ్టీ ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ పోర్టల్’ అని ప్రశంసించింది. 'ధరణి పోర్టల్‌కు 2020 నవంబర్ 2 నుంచి ఈ ఏడాది నవంబర్ 2 వరకు‌‌‌‌‌‌‌‌ 9.16 కోట్ల హిట్స్ రాగా.. రూ. 26 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. గతంలో 2.97 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినా మ్యుటేషన్లు జరగలేదు. ధరణి ప్రారంభంతో వీటికి పరిష్కారం లభించింది. భూ సంబంధిత 3.16 లక్షల వివాదాలను ప్రభుత్వం పరిష్కరించింది. 11.24 లక్షల లావాదేవీలను ధరణి ద్వారా పూర్తి చేశారు. 2.81 లక్షల గిఫ్ట్‌డీడ్‌లను రిజిస్ట్రేషన్లు చేసింది. లక్షా 80 వేల మందికి సక్సేషన్ రైట్స్ ను ధరణి అందించింది.' అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2022-11-04T18:45:43+05:30 IST