Home » Dharani
ఇవే కాదు.. భూ లావాదేవీలకు సంబంధించి ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చాక చిత్ర విచిత్రాలు చాలా జరిగాయి. ధరణిని వాడుకుని చాలా మంది వందల ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేశారనే ఫిర్యాదులున్నాయి.
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ కారణంగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు పెద్ద ఎత్తున అక్రమార్కుల పాలయ్యాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన ఆర్వోఆర్ చట్టానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గురు, లేదా శుక్రవారాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
ధరణి పోర్టల్ సేవలు సాంకేతిక కారణాల రీత్యా నాలుగు రోజుల పాటు అందుబాటులో ఉండవని ప్రధాన భూ పరిపాలనా కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది.
ధరణిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ధరణి సమస్యలను శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టింది. ధరణిని ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను విదేశీ సంస్థ టెర్రాసిస్ నుంచి ‘జాతీయ సమాచార కేంద్రాని (ఎన్ఐసీ)’కి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో ఉత్తర్వులిచ్చింది.
నూతన రెవెన్యూ చట్టాన్ని(ఆర్వోఆర్-2024) తీసుకురాబోతున్న వేళ ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ధరణిలో పెండింగ్లో ఉన్న పలు దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించింది.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిశీలించి జీరో స్టేజికి తీసుకురావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్మిత్తల్ ఆదేశించారు. దరఖాస్తులు వేగవంతంగా క్లియర్ చేసేందుకు ఎమ్మార్వోలకు అదనంగా లాగిన్లు ఇచ్చారు. రోజుకు వంద చొప్పున పెండింగ్ దరఖాస్తులు పరిశీలించాలని లక్ష్యం విధించారు.
ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిన తరువాత కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారని, ఈ క్రమంలో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని రిటైర్డ్ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది.
‘ధరణి’ పోర్టల్ సాయంతో తమ ప్లాట్లు కబ్జా చేశారని తట్టి అన్నారం సమీపంలోని మధురానగర్ ప్లాట్ యజమానులు ఆరోపించారు.