MLAs purchase case: ముగిసిన రామచంద్రభారతి, నందకుమార్ పోలీసుల విచారణ
ABN , First Publish Date - 2022-12-08T16:45:01+05:30 IST
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్ (Ramachandra Bharathi, Nandakumar) పోలీసుల విచారణ ముగిసింది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs purchase case)లో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్ (Ramachandra Bharathi, Nandakumar) పోలీసుల విచారణ ముగిసింది. ఇద్దరిని నాంపల్లి కోర్టు (Nampally Court)లో బంజారాహిల్స్ పోలీసులు హాజరుపర్చారు. ఫేక్ పాస్‌పోర్ట్, పాన్‌కార్డు వ్యవహారంలో రామచంద్రభారతిపై కేసు చేశారు. లీజు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ నందకుమార్‌పై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చంచల్‌గూడ జైలు నుంచి రామచంద్రభారతి, నందు విడుదలయ్యారు. అయితే తిరిగి జైలు దగ్గరే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతి, నందుతో పాటు సింహయాజిని పోలీసులు అక్టోబర్ 29న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సుమారు 41 రోజుల పాటు వీరు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ మంజూరు చేయడంతో సింహయాజి బుధవారం విడుదలయ్యాడు. రామచంద్రభారతి, నందు బెయిల్ ప్రక్రియ నిన్న పూర్తైంది. ఈ కేసులో ఇద్దరికి చెరో రూ. 6 లక్షల చొప్పున ష్యూరిటీతో బెయిల్.. నందుకు బంజారాహిల్స్ కేసులో రూ. 20 వేల ష్యూరిటీతో బెయిల్ లభించింది. బెయిల్ పక్రియ ముగియడంతో ఈ ఇద్దరు చంచల్‌గూడ జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. జైలు దగ్గరే రామచంద్రభారతి, నందును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.