కాళేశ్వరం ముంపు బాధితుల పోస్ట్కార్డ్ ఉద్యమం

ABN , First Publish Date - 2022-10-27T19:12:43+05:30 IST

కాళేశ్వరం ముంపు బాధితుల పోస్ట్కార్డ్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలతో పాటు మంత్రి కేటీఆర్ (Ktr)కు మహారాష్ట్రలోని సిరొంచా గ్రామానికి చెందిన మేడిగడ్డ ముంపు రైతులు ఉత్తరాలు రాశారు.

కాళేశ్వరం ముంపు బాధితుల పోస్ట్కార్డ్ ఉద్యమం

జయశంకర్: కాళేశ్వరం ముంపు బాధితుల పోస్ట్కార్డ్ ఉద్యమానికి సిద్ధమయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర సీఎంలతో పాటు మంత్రి కేటీఆర్ (Ktr)కు మహారాష్ట్రలోని సిరొంచా గ్రామానికి చెందిన మేడిగడ్డ ముంపు రైతులు ఉత్తరాలు రాశారు. మేడిగడ్డ ముంపు బాధితులను ఆదుకోవాలని మహా రైతులు కోరారు. మూడేళ్లుగా వందల ఎకరాల పంటలు ముంపునకు గురవుతున్నా.. కేసీఆర్ (kcr) స్పందించకపోవడంతో ఉత్తరాలు రాసినట్లు రైతులు తెలిపారు. వారంరోజుల్లో స్పందించకపోతే బాధిత కుటుంబాలతో ఆందోళనలని వెల్లడిపరుస్తామని వెల్లడించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ముంపునకు గురవుతున్న పంట పొలాలకు.. ప్రతీ ఎకరానికి రూ.20 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-10-27T19:12:45+05:30 IST