YS Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి రూ. 70 వేల కోట్లు కమీషన్ కాజేశాడు
ABN , First Publish Date - 2022-11-21T21:14:39+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి: వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ శర్మిల సీఎం కేసీఆర్ (CM KCR)పై ఘాటు విమర్శలు చేశారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
జయశంకర్ భూపాలపల్లి: వైఎస్ఆర్టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ శర్మిల సీఎం కేసీఆర్ (CM KCR)పై ఘాటు విమర్శలు చేశారు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleswaram Project) పేరు చెప్పి రూ. 70 వేల కోట్లు కమీషన్ కాజేశాడని ఆరోపించారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఉంటేనే ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చే కేసీఆర్కు జనం ఈ సారి మొండి చేయి చూపడం ఖాయమన్నారు.