MLA Korukanti: సింగరేణిని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం..

ABN , First Publish Date - 2022-12-26T14:47:59+05:30 IST

పెద్దపల్లి జిల్లా: నాలుగు బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ (Privatization)ను వ్యతిరేకిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (Korukanti Chander) ఆధ్వర్యంలో సింగరేణి పోరు దీక్ష (Singareni Poru Diksha) మొదలైంది.

MLA Korukanti: సింగరేణిని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోం..

పెద్దపల్లి జిల్లా: నాలుగు బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ (Privatization)ను వ్యతిరేకిస్తూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ (Korukanti Chander) ఆధ్వర్యంలో సింగరేణి పోరు దీక్ష (Singareni Poru Diksha) మొదలైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ తెలంగాణ గుండెకాయ సింగరేణిని ప్రైవేటీకరణ చేయనని చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నాలుగు బొగ్గు బ్లాకులు వేలం వేయడానికి రంగం సిద్ధం చేశారని, సింగరేణిని ప్రైవేటు పరం చేస్తే ఊరుకోమని అన్నారు. సింగరేణి పోరుదీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని.. లేకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో సింగరేణి ఉద్యమం జరుగుతుందని అన్నారు. పోరుదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-12-26T14:48:03+05:30 IST