Home » Telangana » Karimnagar
అర్బన్ అటవీ పార్కు ఏర్పాటుతో పట్టణ, పరిసరప్రాంత ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల మండలం అంబారిపేట గ్రామంలోని ఫారెస్ట్‌లో రెండు కోట్ల రూపాయలతో చేపడుతున్న పార్కు పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు.
నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి ఆవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ రఘచంద ర్, సీఐ వేణుగోపాల్‌లతో పాటు పోలీస్ సిబ్బంది జగిత్యాల పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వ హించారు.
ఆస్తుల పరిరక్షణలో అప్రమ త్తంగా ఉండాలని ఆర్జీ-2 జీఎం వెంకటయ్య అన్నారు.
డిసెంబర్లో ఆర్జీ-1 ఏరియాలో 98శాతం బొగ్గు ఉత్పత్తిని సాధిం చినట్టు ఆర్జీ-1 జీఎం లలిత్‌కుమార్ చెప్పారు.
పాత సంవత్సరానికి బైబై చెబుతూ.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. మంగళవారం అర్ధరాత్రి యువకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
రామగుండం లో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తాము చేస్తున్న అభివృద్ధే జవాబు అని, పనులు మొదలయ్యాయని, ఆరు నెలల్లో మార్పు ఏమిటో స్పష్టంగా క్షేత్రస్థాయి కని పించనున్నదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు.
ఎన్నో అనుభూతుల్ని పంచిన 2024 సంవత్సరం కాలంలో కలిసిపోయింది. నందోత్సాహాలను, నూతనోత్తేజాన్ని నింపేందుకు 2025 ముందు నిలిచింది.
జిల్లా ప్రజలు కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే చిన్నాపెద్దా కేరింతలు కొట్టారు. గడిచిన జ్ఞాపకాలతో 2024కు వీడ్కోలు పలుకుతూ కొత్త లక్ష్యాలతో 2025కు ఘనంగా స్వాగతం పలికారు. అర్ధరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు మండల, గ్రామాల్లో పండగవాతావరణం కనిపించింది.
జిల్లాలో కొత్త మండలాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. గత ప్రభుత్వం కొత్త జిల్లాలో ఏర్పాటు సమయంలో రెవెన్యూ డివిజన్లతో పాటు కొన్ని మండలాలను ఏర్పాటు చేసింది. మెట్పల్లి, కోరుట్ల రెవెన్యూ డివిజన్లను అప్పటి ప్ర భుత్వం ఏర్పాటు చేసింది. దీనికి తోడు బీమారం, ఎండపల్లి మండలా లను సైతం కొత్తగా ఏర్పాటు చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముం దు ప్రభుత్వం జిల్లాలోని బండలింగాపూర్‌ను సైతం మండలంగా ఏర్పా టు చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాది గడిచి పోయింది. ఈ ఏడాది కాలంలో జిల్లాకు చెందిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ రెట్టింపు ఉత్సాహంతో తమ నియోజకవర్గాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నారు.